సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్
టూల్‌చెయిన్ నుంచి యాప్ వరకు
IP Technology అనేది LLVM ఆధారిత టూల్‌చెయిన్‌లు, క్రాస్-ప్లాట్‌ఫామ్ ఫ్రేమ్‌వర్క్‌లు, అప్లికేషన్‌లలో నైపుణ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ సంస్థ. స్టాక్‌లో సమస్య ఏ స్థాయిలో ఉన్నా, క్లిష్టమైన ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడంలో మీ బృందానికి తోడ్పడతాం.
మా సేవలు
స్టాక్‌లోని ప్రతి స్థాయిలో ఇంజినీరింగ్
మాకు లోతైన నైపుణ్యం ఉన్న మూడు రంగాల్లో నిర్దిష్ట ప్రాజెక్టులు చేపడతాం, దీర్ఘకాలికంగానూ మీతో కలిసి పనిచేస్తాం.
-
LLVM ఆధారిత టూల్‌చెయిన్‌లు
టూల్‌చెయిన్‌లో కంపైలర్ ఒక భాగం మాత్రమే. కంపైలర్లు, లింకర్ల నుంచి డీబగ్గర్లు, రన్‌టైమ్ లైబ్రరీల వరకు టూల్‌చెయిన్ అంతటా పనిచేస్తాం. కొత్త టార్గెట్‌లకు మద్దతు, కొత్త ఫీచర్లను జోడిస్తాం. గుర్తించడం కష్టమైన బగ్‌లను పరిష్కరిస్తాం, పనితీరును మెరుగుపరుస్తాం.
-
క్రాస్-ప్లాట్‌ఫామ్ ఫ్రేమ్‌వర్క్‌లు
ఒకే కోడ్‌బేస్ Windows, macOS, Linux, Android, iOS ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో పనిచేసేలా ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందిస్తాం, మెరుగుపరుస్తాం. ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్, రెండరింగ్, ఇన్‌పుట్‌పై పనిచేస్తాం. ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ యాప్ వాడకం నేటివ్ యాప్‌లా అనిపించేలా పనితీరును మెరుగుపరుస్తాం.
-
అప్లికేషన్‌లు
డెస్క్‌టాప్, మొబైల్ అప్లికేషన్‌ల రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలను అన్ని దశల్లో చేపడతాం. ఆర్కిటెక్చర్, యూజర్ ఇంటర్‌ఫేస్ నుంచి విడుదల, దీర్ఘకాలిక నిర్వహణ వరకు చూసుకుంటాం.
మేం పనిచేసే తీరు
మొత్తం స్టాక్‌కు ఒకే బృందం
వాస్తవ సమస్యలు చాలా అరుదుగా స్టాక్‌లో ఒకే స్థాయికి పరిమితమవుతాయి. టూల్‌చెయిన్‌లు, ఫ్రేమ్‌వర్క్‌లు, అప్లికేషన్‌లపై పనిచేసే అనుభవంతో సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకునే వరకు అన్ని స్థాయుల్లోనూ పరిశీలించగలం.
- తాత్కాలిక సర్దుబాట్లకు బదులు మూలకారణానికే పరిష్కారం
- ఫ్రేమ్‌వర్క్ వల్ల యాప్‌లో సమస్య వచ్చినా, కంపైలర్ వల్ల ఫ్రేమ్‌వర్క్‌లో సమస్య వచ్చినా, సమస్య ఎక్కడ మొదలైందో గుర్తించి అక్కడే పరిష్కరిస్తాం.
- ఇంజినీర్లతో నేరుగా సంప్రదింపులు
- మీరు మధ్యవర్తులు లేకుండా కోడ్ రాసే ఇంజినీర్లతోనే నేరుగా కలిసి పనిచేస్తారు.
- నిర్వహణ సులభమయ్యేలా రూపకల్పన
- మేం అందించే సాఫ్ట్‌వేర్ నిర్వహణ బాధ్యతను మీ బృందం నమ్మకంగా చేపట్టగలిగేలా స్పష్టమైన కోడ్‌తో పాటు టెస్ట్‌లు, డాక్యుమెంటేషన్ అందిస్తాం.
సంప్రదింపులు
మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి
కంపైలర్‌లో సమస్యను పరిష్కరించాలన్నా, ఫ్రేమ్‌వర్క్‌ను కొత్త ప్లాట్‌ఫామ్‌కు తీసుకెళ్లాలన్నా, మొదటి నుంచి యాప్‌ను రూపొందించాలన్నా, మీ అవసరం గురించి మాకు చెప్పండి. ఈమెయిల్ ద్వారా స్పందిస్తాం.
సందేశం పంపాం
మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈమెయిల్ చిరునామాకు ప్రత్యుత్తరం పంపుతాం.